సూర్య భగవానుడే స్వయంగా చెప్పిన " సూర్య స్తుతి "
#########################################
ఈ క్రింది స్తోత్రమును సూర్య భగవానుడే స్వయముగా సాంబునికి ప్రవచించారు:
స్తోత్రం: వైకర్తనో వివస్వా౦శ్చ మార్తా౦డో భాస్కరో రవిః |
లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గహేశ్వరః ||
లోకసాక్షేత్రిలోకేశః కర్తాహర్తా తమిస్రహా |
తపనస్తావనశ్చైవ శుచిః సప్తాశ్చ వాహన ||
గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః |
ఫలశ్రుతి : ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ ||
శరీరారోగ్య దశ్చైవ ధనవృద్ధి యశస్కరః |
స్తవరాజ ఇతిఖ్యాత త్రిషులోకేషు విశ్రుతః ||
య ఏతతే మహాబాహో ! ద్వేసంధ్యేఽ స్థామనోదయే |
స్తౌతి మాంప్రణతో భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే ||
మానసం వాచికం వాపి కాయికం యచ్చదుష్క్రుతమే |
ఏకజాప్యేనతత్సర్వ౦ ప్రణశ్యతి మమాస్రతః ||
ఏషజాప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసనమేవ చ |
బలిమంత్రోఽర్ఘ్య మంత్రో థ రూపమంత్రస్తథైవచ ||
అన్నప్రదానే స్నానేచ ప్రణిపాతే ప్రదక్షిణే |
పూజతోఽ యం మహామంత్రః సర్వపాపహరః శుభః ||
(శ్లో || 1 - 12, అధ్యా - 128)
సాంబా! సర్వ శుభప్రదమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి అయినటువంటి 21 నామాలు చెప్పెదను, జాగరూకుడవై ఆలకించు.
1. వైకర్తనుడు
2. వివస్వంతుడు
౩. మార్తా౦డుడు
4. భాస్కరుడు
5. రవి
6. లోకప్రకాశకుడు
7. శ్రీమంతుడు
8. లోకచక్షువు
9. గ్రహేశ్వరుడు
10. లోకసాక్షి
11. త్రిలోకేశుడు
12. కర్త
13. హర్త
14. తమిస్రహుడు
15. తపనుడు
16. తాపనుడు
17. శుచి
18. సప్తాశ్వ వాహనుడు
19. గభస్తిహరుడు
20. బ్రహ్మ
21. సర్వదేవనమస్కృతుడు
ఈ 21 నామాలతో కూడిన stస్తోత్రం నాకు ప్రీతిపాత్రమైనది. దీన్ని పఠిస్తే శరీరారోగ్యం, ధనవృద్ధి, కీర్తిప్రతిష్ఠలు పెంపొందుతాయి. ముల్లోకాల్లో ఇది గోప్పస్తవరజంగా పేర్కొనది. ఉదయ అస్తమాన సంధ్యలలో ఈ స్తోత్ర౦తో ఎవరు నన్ను స్తుతిస్తారో !వారి పాపాలన్నీ నశిస్తాయి.
ఈ స్తోత్రమే - మంత్రజపం, హోమం, సంధ్యోపాసన, పూజామంత్రం, అర్ఘ్య మంత్రం, ధూప మంత్రం కూడా. అన్నం నివేదించేటప్పుడు నాకు అభిషేకం, అర్చన, ప్రదక్షిణ చేసేడప్పుడు ఈ స్తోత్ర మంత్రాన్నే పఠించాలి, ఎందుకంటే ఇది సకలపాపహర౦, శుభకరం అయిన స్తోత్రం కనుక అని ప్రబోధించాడు.
ఇంతకు ఈ సాంబుడు ఎవరు? సూర్య దేవుడే స్వయంగా ప్రవచించాల్సిన అవసరం ఏంటి అనే అనుమానం వచ్చిందా? అయితే ఆ కథ కమామిషు చెప్తాను చదవండి..
సాంబుడు స్వయానా శ్రీ కృష్ణ పరమాత్ముడికి - జాంబవతులకు కలిగిన సంతానం. రూపం తండ్రిదే అయినా బుద్ధులు ఆయనవి రాలేదు. చాల పాపాలు చేసేవాడు, ఎవరు మందలించిన లెక్కచేయలేదు. చివరకు ఒకసారి శ్రీ నారద మహర్షిని అవమానించడంతో, నారద మహర్షి సాంబుడిని భయంకరమైన కుష్ఠు వ్యాధితో బాధపడమని శపించారు. కుష్ఠు వ్యాధితో బాధపడుతూ,తన తండ్రి అయినా శ్రీ కృష్ణుడిని శరణు వేడగ, కృష్ణయ్య సాంబుడిని చేసిన తప్పుకు శిక్ష అనుభవించమని, ఇందులో అయన ఏ విధముగా సహాయము చేయబోనని చెప్పగా.
అంతటా సాంబుడు పశ్చాత్తాపడి, తన రోగం నుండి విముక్తుడవ్వడానికి మార్గం వెతుకుతూ వారణాసి చేరాడు. అక్కడ సూర్య భగవానుడికి ఘోర తపస్సు చేసి, ఆ రోగము నుండి విముక్తి పొందాడు. అందుకు గుర్తుగా కాశీలో, సూరజ్ కుండ్ దెగ్గరలో "సాంబాదిత్యడు " పేర గుడి కట్టబడినది.
తనకు రోగం తగ్గిన తరువాత కూడా సూర్య భగవానుడిని ఆరాదించిస్తున్న సాంబుడి భక్తికి మెచ్చి, కలలో సాంబుడికి ఆ సూర్య భగవానుడే ఈ స్త్రోత్రాన్ని స్వయంగా ప్రవచించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి