గకారాక్షర స్వరూపుడైన విఘ్నేశ్వరుడి పూజ కి ప్రత్యేకంగా తిథి, నక్షత్రం, ఉపవాస విధులు ఆచరించక్కర్లేదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ గణపతి విగ్రహాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. వివిధ రకాల పదార్థాలతో గణపతి ప్రతిమలు చేయవచ్చు అయితే ఒక్కో రకమైన ప్రతిమను ఒక్కో విధంగా పూజించాలి.
శ్వేతార్క(తెల్లజిల్లేడు) గణపతి :
గణపతికి చాలా ఇష్టమైన వృక్షం తెల్లజిల్లేడు. అందుకే తెల్లజిల్లేడు వేరుని తెచ్చి దానితో బొటనవేలికణపు పరిమాణంలో గణపతి విగ్రహాన్ని చెక్కించాలి.
ఆ విగ్రహం ఎలా ఉండాలంటే పద్మాసనంలో కూర్చుని, నాలుగు భుజాలతో, మూడు కళ్లతో, ఆభరణాలు, సర్ప యజ్ఞోపవీతం, తలమీద చంద్రరేఖ, ఎడమచేతిలో దంతం, కుడిచేతిలో జపమాల, మూడో చేతిలో గొడ్డలి, నాలుగు చేతిలో ఉండ్రాయిని ధరించినట్టు గా చెక్కించాలి.
*ఉదాహరణకు తీసుకొనబడిన చిత్రము.
పూజా విథి:
ఈ విధంగా చెక్కించిన గణపతి ప్రతిమని యధావిథిగా స్థాపించి సమాలంభం (అనగా కుంకుమ చందనం కలిపిన పొడి)తో, వస్త్ర భూషణాలు సమర్పించి, ఎర్రని పూలతో గణపతిని పూజించాలి.
తరువాత సుగంధ భరిత ధూపాన్ని సమర్పించి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి.
ఈ పూజ చేయటానికి ముందు విప్రుడికి భోజనం పెట్టాలి.
ఆ బ్రాహ్మణుడు పొట్టిగా మరుగుజ్జువాడు గా ఉండాలి. అలాంటి విప్రుణ్ణి పూజించి అతని ఆశీర్వచనాన్ని తీసుకోవాలి.
పూజ మంత్రాలు:
శ్వేతార్క గణపతికి ఈ క్రింది మంత్రంతో పూజ చేయాలి గణపతి మూల మంత్రం- ఓం గం స్వాహా
ఓం గం నమః హృదయాయ నమః
ఓం గీం శిరసేస్వాహా
ఓం గూం శిఖాయైవషట్
ఓం గైం కవచాయహుం
ఓం గౌం నేత్రత్రయాయై వౌషట్
ఓం గః అస్త్రాయఫట్
అని హృదయన్యాసం చేయాలి.
ఓం ఆ గా ఉల్లాస స్వాహా అని గణపతిని ఆహ్వానించాలి.
ఓం గం గణేశాయనమః అని గంధాన్ని సమర్పించాలి.
ఓం గం పుష్పోల్కాయనమః అని పుష్పాలను సమర్పించాలి.
ఓం గం ధూపోల్కాయ నమః అని ధూపాన్ని సమర్పించాలి.
ఓం గం దీపోల్కాయ నమః అని దీపాన్ని సమర్పించాలి.
ఓం గం మహోల్కాయ నమః అని నైవేద్యం సమర్పించాలి.
ఓం సంసిద్ధోల్కాయ నమః అని గణపతికి ఉద్వాసన చెప్పాలి.
పూజ మంత్రాలు:
శ్వేతార్క గణపతికి ఈ క్రింది మంత్రంతో పూజ చేయాలి గణపతి మూల మంత్రం- ఓం గం స్వాహా
ఓం గం నమః హృదయాయ నమః
ఓం గీం శిరసేస్వాహా
ఓం గూం శిఖాయైవషట్
ఓం గైం కవచాయహుం
ఓం గౌం నేత్రత్రయాయై వౌషట్
ఓం గః అస్త్రాయఫట్
అని హృదయన్యాసం చేయాలి.
ఓం ఆ గా ఉల్లాస స్వాహా అని గణపతిని ఆహ్వానించాలి.
ఓం గం గణేశాయనమః అని గంధాన్ని సమర్పించాలి.
ఓం గం పుష్పోల్కాయనమః అని పుష్పాలను సమర్పించాలి.
ఓం గం ధూపోల్కాయ నమః అని ధూపాన్ని సమర్పించాలి.
ఓం గం దీపోల్కాయ నమః అని దీపాన్ని సమర్పించాలి.
ఓం గం మహోల్కాయ నమః అని నైవేద్యం సమర్పించాలి.
ఓం సంసిద్ధోల్కాయ నమః అని గణపతికి ఉద్వాసన చెప్పాలి.
హోమ విధి:
ఈ విధంగా శ్వేతార్క గణపతిని పూజించిన తరువాత ఈ క్రింది విధంగా మంత్రాలు చెబుతూ హోమం చేయ్యాలి.
ముందుగా హోమకుండాల్ని ఏర్పాటు చేసుకొని అందులో తూర్పు దిశలో "ఓం మహా కర్ణాయవిద్మహే వక్రతుండాయ ధీమహితన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా" అనే మంత్రాన్ని పఠించి ఆహుతిని సమర్పించాలి.
"ఓం మహా గణపతయే స్వాహా" అని పఠిస్తూ దక్షిణ దిశలో, "ఓం మహోల్కాయ స్వాహా" అని పడమర దిశలో, "ఓం కూశ్మాండాయ స్వాహా" అని ఉత్తరదిశలో, "ఓం ఏకదంత త్రిపురాయ స్వాహా" అని ఆగ్నేయ దిశలో, "ఓం శివదత్త వికటహర హాస ప్రాణాయస్వాహా" అని చెబుతూ నైరుతి దిక్కులో, "ఓం తులంబనాత్యచల దంతాయ స్వాహా" అని వాయవ్య దిక్కున, "ఓం పద్మ దంష్ర్టాయవరాయ స్వాహా" అని ఈశాన్య దిశలో హోమం చెయ్యాలి.
జపం హోమ - ఫలితాలు:
1.పై తెలిపిన శ్వేతార్క గణపతి హోమాన్ని నువ్వులతో ఎనిమిది వేల సార్లు చేస్తే మూడు రాత్రులు రాజు వశమవుతాడు.
2. తిలలు, యవలు కలిపి హోమం చేస్తే జానపదులంతా వశ్యమవుతారు. సకలజన వశీకరణ శక్తి లభిస్తుంది.
3. శనగలు బియ్యంతో హోమం చేస్తే దుర్జయుడవుతాడు.
4. వివిధ రకాల నూనెలతో హోమం చేస్తే విద్వేషణ ఫలిస్తుంది .
5. చంద్రగ్రహణ సమయంలో మూలమంత్రాన్ని నీళ్ళలో నిలబడి చేస్తే యుద్ధంలో విజయం లభిస్తుంది.
6.సూర్యగ్రహణం నాడు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఎనిమిదివేల జపం చేస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది.
7. శుక్లపక్ష చతుర్థి రోజు ఉపవాసం ఉండి గణపతిని పూజించి నువ్వులు, బియ్యంతో హోమ్ చేయాలి. తర్వాత హోమభస్మాన్ని ధరించాలి. అలా చేస్తే శత్రు పరాజయం కలుగుతుంది.
"ఓం గం స్వాహా" అనే ఈ గణపతి మూల మంత్రం తక్కువ సంఖ్యలో (కనీసం 40,000 లేదా నాలుగు వేలు) జపించినా సిద్ధిస్తుంది. ముందుగా ఈ మంత్రాన్ని పై తెలిపిన సంఖ్యలో జరిపించి ఆ తరువాత హోమం చేసేటప్పుడు:
1. ఓం వక్రతుండాయ స్వాహా
2. ఓం ఏకదంష్ర్టాయ స్వాహా
3. ఓం కృత కృష్ణాయ స్వాహా
4. ఓం గజకర్ణాయ స్వాహా
5. ఓం లంబోదరాయ స్వాహా
6. ఓం వికటాయ స్వాహా
7. ఓం ధూమ్రవర్ణాయ స్వాహా
8. ఓం గగనకుజాయ స్వాహా
9. ఓం వినాయకాయ స్వాహా
10. ఓం గణపతయే స్వాహా
11. ఓం హస్తిముఖాయ స్వాహా
అనే 11 మంత్రాలతో ఆహుతుల్ని సమర్పించాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో గణపతి పూజని,జప హోమాల్ని నిర్వర్తించిన వాడికి అసాధ్యమైన కార్యమేది ఉండదు. ఈ పూజని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు.
*ఇక్కడ పొందుపరచిన విషయాలు పుస్తకాలనుండి తీసుకోబడినవి. నా సొంతం కాదు. ఆ మూఢ విశ్వాసాలను ప్రోత్సహించడం మా ఉద్దేసం కాదు.

Super madem chala baga rasaru
రిప్లయితొలగించండి